శ్రీలంక కూల్‌డ్రింక్స్ విక్రయించనున్న రిలయన్స్

by S Gopi |
శ్రీలంక కూల్‌డ్రింక్స్ విక్రయించనున్న రిలయన్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో దేశీయ దిగ్గజ రిలయన్స్ కొత్త కూల్‌డ్రింక్ బ్రాండ్లను మార్కెట్లో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కంపెనీ కాంపా కోలా, సోస్యో బ్రాండ్లను విడుదల చేసిన రిలయన్స్, ఎఫ్ఎంసీజీ వ్యాపారంపై మరింత దృష్టి సారించాలని భావించి కొత్త బ్రాండ్లను పరిచయం చేసే పనిలో ఉంది. తాజాగా, శ్రీలంకకు చెందిన ఎలిఫెంట్ హౌస్ బ్రాండ్‌కు చెందిన కూల్‌డ్రింక్స్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. దీంతో కోకా-కోలా, పెప్సీకి పోటీ ఇవ్వాలని రిలయన్స్ భావిస్తోంది. ఎలిఫెంట్ హౌస్ బ్రాండ్ కింద కూల్ డ్రింక్స్, మార్కెటింగ్, సరఫరా, రిటైల్ వ్యాపారం కోసం కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల రిలయన్స్ తన ఎఫ్‌ఎంసీజీ విభాగం పోర్ట్‌ఫోలియోను విస్తరించి, కొత్త ఉత్పత్తులను వినియోగదారులకు అందించనుంది. ఇదివరకు రిలయన్స్ లోటస్ చాక్లెట్స్, శ్రీలంకకు చెందిన మాలిబన్ బిస్కెట్లను కూడా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story