- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎఫ్‌సీఐకి తగ్గిన బియ్యం, గోధుమల సేకరణ
దిశ, బిజినెస్ బ్యూరో: తక్కువ దిగుబడి, అధిక తేమ కారణంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)కి గోధుమలు, వరి సేకరణ తగ్గిపోయింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో ఆశించిన మేరకు సరఫరా లేకపోవడంతో గోధుమల కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా, ప్రభుత్వ గోధుమ సేకరణ అంతకు ముందు సంవత్సరం కంటే 36 శాతం తక్కువగా ఉంది. 2024-25 రబీ సీజన్‌లో ఇప్పటి వరకు గోధుమ సేకరణ 7.1 మిలియన్ టన్నులుగా ఉంది, గత ఏడాది ఇదే కాలంలో 11.1 మిలియన్ టన్నులుగా నమోదైంది. వరి/ బియ్యం విషయానికొస్తే, వరి ధరలు అధికం కావడం, రైతులు తమ ఉత్పత్తులను ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు. దీంతో ఎఫ్‌సీఐకి తక్కువ స్థాయిలో బియ్యం సరఫరా అయింది. బియ్యం సేకరణ సంవత్సరానికి 7-8 శాతం లేదా 5 మిలియన్ టన్నులు తక్కువగా ఉంది.
వరి లేదా గోధుమలను తక్కువగా సేకరించడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడే అవకాశం లేదని అధికారి తెలిపారు. ఎఫ్‌సీఐ తన స్టాక్‌లో 10.3 మిలియన్ టన్నులు గోధుమలు, 31.2 మిలియన్ టన్నుల బియ్యాన్ని కలిగి ఉంది. చల్లని వాతావరణం, మేఘావృతమైన పరిస్థితుల కారణంగా గోధుమ పంటలో తేమ శాతం ఎక్కువగా ఉండటం, కోత ఆలస్యం కావడం వలన ప్రభుత్వ సేకరణ తగ్గిందని, అలాగే, అధిక రాబడి వస్తుందని రైతులు బియ్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడం వలన దీని సేకరణ గతంతో పోలిస్తే తగ్గిందని సీనియర్ అధికారి తెలిపారు.