హౌతీ దాడులతో రెట్టింపు పెరిగిన రవాణా ఖర్చు

by S Gopi |
హౌతీ దాడులతో రెట్టింపు పెరిగిన రవాణా ఖర్చు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఎర్ర సముద్రంలో హౌతీ మిలిటెంట్లు రవాణా ఓడలపై దాడులను కొనసాగించడం వల్ల భారత ముడిచమురు సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) ఛైర్మన్ పుష్ప్ కుమార్ జోషి చెప్పారు. అయితే, కేప్ ఆఫ్ గుడ్‌హోప్ ద్వారా నౌకలను మళ్లంచడంతో సరుకు రవాణా ఖర్చు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. భారత్ నుంచి యూరప్‌కు 600 డాలర్ల నుంచి 1,500 డాలర్లకు రవాణా ఖర్చు పెరిగిందన్నారు. ప్రపంచ మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్ ఎక్కువ భాగం రష్యా చమురును ఎర్ర సముద్రం మార్గం గుండానే సరఫరా చేస్తోంది. 2023లో భారత మొత్తం ముడిచమురు దిగుమతుల్లో 35 శాతానికి పైగా రష్యా నుంచి జరిగాయి. ఇవి రోజుకు 17 లక్షల బ్యారెళ్లకు చేరుకున్నాయి. హౌతీ దాడులతో సూయజ్ కెనాల్, ఎర్ర సముద్రం నుంచి సరఫరా చేయడానికి బదులు ఆఫ్రికా దక్షిణ కొన చుట్టూ నౌకలను మళ్లించడం వల్ల ఎక్కువ సమయం పడుతోంది. దీనివల్ల ఓడల కొరత ఏర్పడటమే కాకుండా సరుకు రవాణా ఛార్జీలు పెరిగాయి.

Advertisement

Next Story

Most Viewed