అమెజాన్ పే కు రూ. 3 కోట్ల జరిమానా విధించిన ఆర్‌బీఐ!

by Harish |
అమెజాన్ పే కు రూ. 3 కోట్ల జరిమానా విధించిన ఆర్‌బీఐ!
X

ముంబై: నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు చెందిన డిజిటల్ పేమెంట్ విభాగం అమెజాన్ పే ఇండియాకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) శుక్రవారం భారీ జరిమానా విధించింది. కేవైసీతో పాటు ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ నిబంధనలను ఖాతరు చేయని కారణంగా రూ. 3.06 కోట్ల జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది.

కేవైసీ విషయంలో తాము ఇచ్చిన నిబంధనలకు కట్టుబడి లేదని గమనించామని, దీనికి పెనాల్టీ ఎందుకు విధించకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చాము. కంపెనీ తెలిపిన వివరాల ఆధారంగా నిబంధనల ఉల్లంఘన జరిగిందని గుర్తిస్తూ జరిమానా విధిచినట్టు ఆర్‌బీఐ వివరించింది. ఈ పెనాల్టీ నియంత్రణ విధానాలకు సంబంధించిన లోపాలపై విధించబడిందని, వినియోగదారుల లావాదేవీల్లో గడువు ముగియడం, ఒప్పంద ఉల్లంఘనకు సంబంధం లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed