రూ.1000, 500 నోట్లపై RBI గవర్నర్ కీలక ప్రకటన

by GSrikanth |   ( Updated:2023-06-08 11:21:42.0  )
రూ.1000, 500 నోట్లపై RBI గవర్నర్ కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: రూ.2000 నోట్లపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక ప్రకటన చేశారు. బ్యాంకుల్లో రూ. 2 వేల నోట్ల డిపాజిట్లపై వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్న ఆర్బీఐ.. గడిచిన 20 రోజుల్లో 2వేల నోట్ల డిపాజిట్ గణనీయంగా పెరిగిందని వెల్లడించింది. కేవలం మూడు వారాల్లోనే 50 శాతం నోట్లు డిపాజిట్ అయినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. ఇప్పటివరకు మొత్తం చెలామణిలో ఉన్న రూ. 2వేల నోట్లలో 85 శాతం బ్యాంకు డిపాజిట్లుగా తిరిగి వచ్చినట్లు తెలిపారు. కాగా, ఈ ఏడాది మే 19న ఆర్బీఐ 2వేల నోట్ల రద్దును ప్రకటించిన విషయం తెలిసింది. 2 వేలనోట్ల మార్పడికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. మరోవైపు నోట్ల ఉపసంహరణ, కొత్త నోట్ల ముద్రణపై రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ. 500 నోట్లు ఉపసంహరించుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అలాంటి వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టబోమని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.

Next Story

Most Viewed