- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్బీఐ ఫిన్ టెక్ లను వ్యాపారంలో కోరుకోవట్లేదు- భారత్ పే కో ఫౌండర్
దిశ, నేషనల్ న్యూస్: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. దీంతో ఈనెల 29 తర్వాత దాదాపు అన్ని పీపీబీఎల్ సేవలు నిలిచిపోనున్నాయి. దీనిపై భారత్ పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ స్పందించారు. ఫిన్ టెక్ సంస్థల ప్రయోజనాలకు విరుద్ధంగా ఆర్బీఐ చర్యలు ఉన్నాయని ఆరోపించారు. ఆర్బీఐ చర్యలతో ఫిన్ టెకే సంస్థలను నాశనం చేస్తుందన్నారు. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఈ విషయాన్ని పరిశీలించాలని పిలుపునిచ్చారు.
"నాకు ఆర్బీఐ బాధ అర్థం కాలేదు. వ్యాపారంలో ఫిన్‌టెక్‌లను ఆర్బీఐ కోరుకోవడం లేదు. ఆర్బీఐ నిర్ణయం ఫిన్‌టెక్‌లకు విరుద్ధమైనవి. దీంతో ఈ రంగాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి" అని అష్నీర్ గ్రోవర్ ఎక్స్ లో రాసుకొచ్చారు. " గత దశాబ్ది కాలంగా మార్కెట్ క్యాపిటల్, ఉపాధి కల్పనలో స్టార్టప్ లు అతిపెద్ద సృష్టికర్తలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఐఐఎం, ఐఐటీలు ప్లేస్ మెంట్స్ ఇప్పించడానికి కష్టపడుతున్నాయి. ఒక దేశంగా మనం అలాంటి గ్రోత్ ని భరించలేం. ఇదో డోగ్లాపన్” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కస్టమర్ అకౌంట్లు, వ్యాలెట్లు, ఫాస్టాగ్స్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులు, ఇతర సాధనాల్లో టాప్-అప్‌లు లేదా డిపాజిట్లను అంగీకరించొద్దని పీపీబీఎల్ కు ఆదేశాలు జారీ చేసింది ఆర్బీఐ. కాగా వడ్డీ, క్యాష్ బ్యాక్స్, రిఫండ్స్ ను కస్టమర్లకు ఎప్పుడైనా చెల్లించుకునే సదుపాయం కల్పించింది. పీపీబీఎల్ కస్టమర్లు తమ ఖాతాల్లో ఎలాంటి బ్యాలెన్స్ ఉన్నా దాన్ని ఎంటువంటి ఆంక్షలు లేకుండా ఉపసంహరించుకోవచ్చు.. వాడుకోవచ్చు అని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో పీపీబీఎల్ చెల్లింపులు తప్ప ఇంకేమీ చేయలేదు. ఆర్బీఐ ఆంక్షలతో పేటీఎం ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయినట్టే.