- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వానికి రూ. 15,000 కోట్లకు పైగా డివిడెండ్ చెల్లించనున్న పీఎస్‌బీలు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన లాభదాయకత కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్‌బీ) 2023-24 ముగిసేలోగా రూ. 15,000 కోట్లకు పైగా డివిడెండ్ చెల్లించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో మొత్తం 12 పీఎస్‌బీలు రూ. 98,000 కోట్ల లాభాలను ఆర్జించాయి. ఇది అంతకుముందు 2022-23 కంటే రూ. 7,000 కోట్లు మాత్రమే తక్కువ. 2021-22లో రూ. 66,539.98 కొట్లతో పోలిస్తే పీఎస్‌బీలు 2022-23లో రూ. 1.05 లక్షల కోట్ల లాభాలను నమోదు చేశాయి. ఫలితంగా ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌బీలు చెల్లించిన రూ. 8,718 కోట్లతో పోలిస్తే 58 శాతం అధికంగా రూ. 13,804 కోట్ల డివిడెండ్‌ను ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభాలు గతంలో కంటే ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వానికి డివిడెండ్ మరింత ఎక్కువ ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంచనాల ప్రకారం, ఇది రూ. 15,000 కోట్ల కంటే ఎక్కువే రావొచ్చు.