ఒక్కచార్జింగ్‌తో 500 కి.మీ.. సరికొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్

by Harish |   ( Updated:2022-11-26 09:43:09.0  )
ఒక్కచార్జింగ్‌తో 500 కి.మీ.. సరికొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్
X

బెంగళూరు: దేశీయ ఆటో ఎలక్ట్రిక్ స్టార్టప్ కంపెనీ ప్రవైగ్ డైనమిక్స్ కొత్తగా 'ప్రవైగ్ డిఫై' పేరుతో మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV ని విడుదల చేసింది. దీని ధర రూ. 39.50 లక్షలు. వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రూ. 51,000 చెల్లించి ముందస్తు బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2023 రెండో త్రైమాసికంలో ప్రారంభమవుతాయి.

ఇది ఒక్కసారి చార్జింగ్‌తో 500 కి.మీల దూరం ప్రయాణం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. కేవలం 4.9 సెకన్లలో 0-100kmph వేగాన్ని అందుకోగలదు, అలాగే 402 బీహె‌చ్‌పీ శక్తిని అందిస్తుంది. కారు 5 మాడ్యూల్ Li-ion 90.9kWh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. దీనిని ఇంట్లో లేదా ఫాస్ట్ చార్జర్ ద్వారా కూడా చార్జ్ చేయవచ్చు. పూర్తిగా చార్జ్ చేయడానికి దాదాపు 8 గంటల సమయం పడుతుంది.


SUV లోపల 15.6-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, ప్రత్యేక క్లైమేట్ కంట్రోల్ జోన్‌లు, మూడ్ లైటింగ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌ మొదలగు ఇతర ఫీచర్లు ఉన్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహన విభాగంలో విస్తరించడానికి కంపెనీ 2028 నాటికి 10 లక్షల కార్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

Next Story

Most Viewed