వ్యాపారాల్లో కొత్త సవాళ్ల కోసం గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ అవసరం: ప్రధాని మోదీ!

by Vinod kumar |   ( Updated:2023-08-27 13:14:45.0  )
వ్యాపారాల్లో కొత్త సవాళ్ల కోసం గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ అవసరం: ప్రధాని మోదీ!
X

న్యూఢిల్లీ: ప్రస్తుతం కొత్త వ్యాపార యుగంలో భారత్ డిజిటల్ విప్లవానికి నాందిగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. క్రిప్టో కరెన్సీ పరిష్కారం, ఏఐ వినియోగంలో నైతిక విస్తరణ కోసం గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. ఆదివారం సీఐఐ ఆధ్వర్యంలో జరుగుతున్న బిజినెస్20(బీ20) ఇండియా సదస్సుల్లో పాల్గొన్న ప్రధాని, కొత్త సవాళ్లు ముందుకొచ్చిన నేపథ్యంలో వ్యాపారాలను హద్దులు దాటి మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది.

సమర్థవంతమైన సరఫరాపై దృష్టి సారించడం ద్వారా ఇది సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ప్రపంచ సరఫరా గొలుసును నిర్మించడంలో భారత్ కీలకంగా ఉంటుందని, సాంకేతికంగా మాత్రమే ప్రపంచంతో అనుసంధానం అవ్వడం కాదు, అది మన పరస్పర ప్రయోజనం, శ్రేయస్సు, భవిష్యత్తు గురించి కూడా అని మోదీ చెప్పారు.

చాలామంది గ్లోబల్ బిజినెస్ లీడర్లు బీ20 సమ్మిట్‌కు హాజరవుతున్నారు. వాతావరణ మార్పు, ఇంధన రంగ సంక్షోభం, నీటి సంక్షోభం, ఆహార సరఫరా అసమతుల్యత, సైబర్ భద్రత వంటి అనేక సమస్యలపై సహకారం అవసరమన్నారు. ఇవన్నీ వ్యాపారాలపై పెద్ద ప్రభావం చూపుతాయి. క్రిప్టోకరెన్సీ, ఏఐ లాంటి వాటిపై గ్లోబల్ వ్యాపారాలు, ప్రభుత్వాల ద్వారా సమగ్రమైన విధానం అవసరమని మోదీ వెల్లడించారు. ఏడాదిలో ఒకరోజును 'అంతర్జాతీయ వినియోగదారుల సంరక్షణ దినోత్సవం'గా జరపాలని వ్యాపారవర్గాలకు సూచించారు. దేశంలో గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారించామని, సౌర విద్యుదుత్పత్తిలో సాధించిన ప్రగతిని ఈ రంగంలోనూ ప్రతిబింబిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed