- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
డిజిటల్ చెల్లింపులలో కీలక మైలురాయిని సాధించిన ఫోన్‌పే
ముంబై: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే కీలక మైలురాయిని సాధించింది. వార్షికంగా మొత్తం చెల్లింపుల రేటింగ్ రూ. 84 లక్షల కోట్లను(1 ట్రిలియన్ డాలర్లు) సాధించినట్లు కంపెనీ శనివారం తెలిపింది. దేశవ్యాప్తంగా UPI లావాదేవీల పట్ల ప్రజల్లో నమ్మకం ఏర్పడటం కారణంగా ఈ ఘనత సాధ్యమైందని అధికారులు తెలిపారు. దేశంలోని టైర్ 2, 3, 4 నగరాల్లో 35 మిలియన్లకు పైగా ఆఫ్‌లైన్ వ్యాపారులను డిజిటలైజ్ చేసినట్లు ఫోన్‌పే పేర్కొంది. UPI లావాదేవీల్లో 50 శాతానికి పైగా మార్కెట్ వాటాతో ఫోన్‌పే అగ్రస్థానంలో ఉందని కంపెనీ తెలిపింది.
ఫోన్‌పే కన్స్యూమర్ బిజినెస్ హెడ్ సోనికా చంద్ర మాట్లాడుతూ, 1 ట్రిలియన్ డాలర్ల వార్షిక TPV రన్‌రేట్‌ను చేరుకోవడం ఆనందంగా ఉంది. వేగవంతమైన, సురక్షితమైన లావాదేవీలను అందిస్తూ వినియోగదారులకు మా పట్ల విశ్వాసాన్ని గెలుచుకున్నాము. UPI లైట్, UPI ఇంటర్నేషనల్, UPIపై క్రెడిట్ వంటి ఆఫర్‌లతో ఇండియాలో మరో వేవ్ వృద్ధికోసం ఎదురుచూస్తున్నామని అన్నారు.
అలాగే, దేశంలోని చిన్న వ్యాపారులు, మధ్య తరహా పరిశ్రమల్లో డిజిటలీకరణను వేగవంతం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఫోన్‌పే ఇన్సూరెన్స్, వెల్త్ మేనేజ్‌మెంట్ వంటి కొత్త వ్యాపారాలలో గణనీయమైన పెట్టుబడులు పెడుతోంది. ఇటీవల, ఫోన్‌పే విదేశాలలో కూడా చెల్లింపులను ప్రారంభించింది.