యూజర్లకు పేటీఎం సీఈవో కీలక ప్రకటన

by Shamantha N |
యూజర్లకు పేటీఎం సీఈవో కీలక ప్రకటన
X

దిశ, బిజినెస్: పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరి 29 తర్వాత కూడా యాప్ పనిచేస్తోందని స్పష్టం చేశారు. తమకు మద్దతిచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. పేటీఎం బ్యాంక్ పై ఇటీవలే ఆర్బీఐ అంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కస్టమర్‌ అకౌంట్లు, వ్యాలెట్లు, ఫాస్టాగ్స్‌, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డులు, ఇతర సాధనాల్లో టాప్‌-అప్‌లు లేదా డిపాజిట్లను అంగీకరించడానికి వీల్లేదని పీపీబీఎల్‌కు ఆర్బీఐ తేల్చి చెప్పింది. దీంతో పేటీఎం ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయాయి. దీనిపై సీఈవో విజయ్ శేఖర్ శర్మ క్లారిటీ ఇచ్చారు.

“మాకు మద్దతు తెలుపుతున్న ప్రతి పేటీఎం టీంమెంబర్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. పూర్తి సమ్మతితో దేశ సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నాం” అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. పేమెంట్ ఇన్నోవేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో భారత్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని.. పేటీఎం అందులో అతిపెద్ద ఛాంపియన్ గా నిలుస్తుందన్నారు. ఫిబ్రవరి 29 తర్వాత కూడా యథావిధిగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. మరోవైపు పేటీఎం షేర్లు వరుసగా రెండో రోజు 20 శాతం పడిపోయాయి.

Advertisement

Next Story

Most Viewed