- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Paytm: వినియోగదారుల చెల్లింపుల వ్యాపారంపై పేటీఎం ఫోకస్
దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తీసుకున్న నియంత్రణ చర్యల కారణంగా సమస్యలు ఎదుర్కొన్న ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం ప్రధాన వ్యాపారంపై దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా వినియోగదారుల సంఖ్యను తిరిగి పొందేందుకు వినియోగదారు చెల్లింపుల వ్యాపారంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయని కంపెనీ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ప్రీపెయిడ్ సాధనాలతో పాటు వ్యాలెట్, కస్టమర్ అకౌంట్లలో డిపాజిట్‌లను తీసుకోవడం, క్రెడిట్ లావాదేవీలు చేయకుండా ఆర్‌బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలపై ఆంక్షలు చేసిన సంగతి తెలిసిందే. దీని తర్వాత పేటీఎం సంస్థ తన కీలక చెల్లింపులు, ఆర్థిక సేవల వ్యాపారంపై దృష్టి సారించేందుకు తన టికెటింగ్ వ్యాపారాన్ని ఫుడ్‌టెక్ కంపెనీ జొమాటోకు విక్రయించింది. పేమెంట్స్ విభాగం తమకు ప్రాథమిక వ్యాపారం. దీనికి ప్రాధాన్యత ఇస్తూ వినియోగదారు చెల్లింపులపై మళ్లీ పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నామని ఆదివారం సీఐఐ సమావేశంలో విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు.