- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏప్రిల్‌లో గణనీయంగా పెరిగిన వాహనాల అమ్మకాలు!
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్ భారత ఆటో పరిశ్రమ మెరుగైన వృద్ధితో సానుకూల అమ్మకాలను సాధించింది. ప్యాసింజర్ వాహనాలతో పాటు త్రీ-వీలర్, టూ-వీలర్, క్వాడ్రిసైకిళ్ల ఉత్పత్తి గత నెలలో 19,57,599 యూనిట్లకు చేరుకుంది. ముఖ్యంగా బీఎస్6 ఫేజ్ 2 ఉద్గార నిబంధనల విజయాన్ని సూచిస్తూ దేశీయ అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి.
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరింగ్(సియామ్) తాజా డేటా ప్రకారం, 2023, ఏప్రిల్‌లో మొత్తం 3,31,278 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడవగా, గతేడాది 12.9 శాతం వృద్ధి చెందింది. ద్విచక్ర వాహన విభాగంలో 13,38,588 యూనిట్ల అమ్మకాలతో ఈ విభాగం అమ్మకాలు 15.1 శాతం పెరిగింది. త్రీ-వీలర్లు సైతం 42,885 యూనిట్లతో కరోనా ముందు నాటి స్థాయికి చేరాయి. ప్యాసింజర్, ద్విచక్ర వాహనాల విభాగాల్లో అమ్మకాలు పరిశ్రమ సానుకూల పనితీరును సూచిస్తున్నాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ అన్నారు.