Krutrim AI: కృత్రిమ్‌ ఏఐలో రూ. 2,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన ఓలా ఫౌండర్

by S Gopi |
Krutrim AI: కృత్రిమ్‌ ఏఐలో రూ. 2,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన ఓలా ఫౌండర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ నేతృత్వంలోని కృత్రిమ్ ఏఐ కొత్త ఓపెన్-సోర్స్ ఏఐ మోడళ్లను విడుదల చేయడం టెక్ రంగంలో అలజడి సృష్టిస్తోంది. ఇప్పటికే అమెరికా, చైనాలకు చెందిన కంపెనీలు ఏఐ రంగంలో దూసుకెళ్తుండగా, భవీశ్ అగర్వాల్ కృత్రిమ్‌ ఏఐలో రూ. 2,000 కోట్ల పెట్టుబడులకు ప్రకటించారు. వచ్చే ఏడాది నాటికి అదనంగా మరో రూ. 10,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ మరింత మెరుగుపరిచేందుకు కొత్త ఏఐ ల్యాబ్‌ను ప్రారంభిస్తామని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వివిధ భాషలు, పరిమిత డేటా, సాంస్కృతిక నైపుణ్యాల వంటి సవాళ్లను ఎదుర్కొంటూ మనదేశ అవసరాలకు అనుగుణంగా ఏఐని రూపొందించడానికి పనిచేస్తున్నట్టు అగర్వాల్ చెప్పారు. చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియా సహకారంతో దేశ మొట్టమొదటి జీబీ200ఏఐ ప్రాసెసర్‌లను తీసుకొస్తామని, తద్వారా ఈ ఏడాదిలోనే దేశంలోనే అతిపెద్ద సూపర్ కంప్యూటర్‌ను నిర్మించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన వివరించారు. ఇప్పటికే భారత మొదటి లార్వ్ లాంగ్వేజ్ మోడల్ కృత్రిమ్1ను కంపెనీ లాంచ్ చేసింది. ఇది బేసిక్ 7బీ మోడల్. దీనికంటే మెరుగైన మోడల్ కృత్రిమ్2ను కంపెనీ త్వరలో తీసుకురానుంది. ఇది తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మళయామ సహా దేశంలోని ప్రధాన భాషలను సపోర్ట్ చేస్తుంది.

Next Story

Most Viewed