యూనికార్న్ హోదా దక్కించుకున్న మొదటి భారతీయ ఏఐ స్టార్టప్ 'కృత్రిమ్'

by S Gopi |
యూనికార్న్ హోదా దక్కించుకున్న మొదటి భారతీయ ఏఐ స్టార్టప్ కృత్రిమ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్టార్టప్ 'కృత్రిమ్' నిధుల సేకరణ సమయంలో 50 మిలియన్ డాలర్ల(రూ. 400 కోట్లకు పైగా) సమీకరించి 1 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా నిలిచింది. దీంతో యూనికార్న్ హోదా సాధించిన మొదటి ఏఐ కంపెనీగా కృత్రిమ్ అవతరించింది. 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన స్టార్టప్ కంపెనీలను యూనికార్న్‌గా పరిగణిస్తారనే సంగతి తెలిసిందే. కృత్రిమ్ డేటా సెంటర్‌లను అభివృద్ధి చేస్తోంది. ఏఐ కోసం సర్వర్లు, సూపర్ కంప్యూటర్‌లను సృష్టించాలనే లక్ష్యంతో ఉంది. 'భారత్ తన స్వంత ఏఐని నిర్మించుకోవాలి' అని భవిష్ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 'దేశీయ మొట్టమొదటి పూర్తి ఏఐను నిర్మించడానికి కట్టుబడి ఉన్నామని' అగర్వాల్ పేర్కొన్నారు. భవిష్ అగర్వాల్‌కు చెందిన ఏఐ స్టార్టప్‌కు సంస్కృతంలో ఉండే 'కృత్రిమ ' అనే పేరుని తీసుకున్నారు. ఇది హిందీ, ఇంగ్లిష్ సహా దేశంలోని ఎనిమిది భాషల్లో సేవలందిస్తుంది.

Advertisement

Next Story