పండగ టైంలో రెండింతలు పెరిగిన ఓలా ఈవీ అమ్మకాలు

by Harish |   ( Updated:2023-11-01 10:29:34.0  )
పండగ టైంలో రెండింతలు పెరిగిన ఓలా ఈవీ అమ్మకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ రైడ్ షేరింగ్ కంపెనీ ఓలా తన ఈవీ అమ్మకాల్లో గణనీయమైన పురోగతిని సాధించింది. ఈ పండగ టైంలో ఈవీల విక్రయాలు 24,000 యూనిట్లుగా నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. గత ఏడాది ఇదే పండుగ సమయంతో పోలిస్తే ప్రస్తుతం అమ్మకాలు రెండింతలు పెరిగాయి. తర్వాత రాబోయే దీపావళికి కూడా అమ్మకాలు పుంజుకుంటాయని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓలా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రస్తుతం డిమాండ్ పెరుగుతుంది. దాదాపు ఈవీ వాహనాల్లో 35 శాతం మార్కెట్ వాటాను ఓలా కలిగి ఉంది. భారీ తగ్గింపులు, క్యాష్‌బ్యాక్‌లు మొదలగునవి అందించడం ద్వారా అమ్మకాలు వృద్ధి చెందాయి.

ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలలో ఓలా వేగంగా వృద్ధి చెందుతుంది. 2023 సంవత్సరం కంపెనీకి ఒకమైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఓలా అక్టోబర్ 16న నెలరోజుల పాటు ఈవీ ఫెస్ట్‌ను ప్రకటించింది. దీనిలో భాగంగా తన స్కూటర్లపై భారీ డిస్కౌంట్‌లను అందించింది.

Advertisement

Next Story

Most Viewed