- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బడ్జెట్ ధరలో కొత్త స్కూటర్లు విడుదల చేసిన ఓలా!
బెంగళూరు: దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ సాంప్రదాయ ఇంధన వాహనాల స్థాయిలోనే ఈ-స్కూటర్లను తెచ్చే లక్ష్యంతో మంగళవారం అత్యంత సరసమైన మోడళ్లను మార్కెట్లో విడుదల చేసింది. భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 'కస్టమర్ డే' పేరున నిర్వహించిన కార్యక్రమంలో ఓలా ఎస్1ఎక్స్ మోడల్లో మూడు వేరియంట్లను తీసుకొచ్చింది. 2కిలోవాట్ అవర్, 3కిలోవాట్ అవర్ వేరియంట్లతో పాటు ఎస్1ఎక్స్ ప్లస్ వేరియంట్‌ను విడుదల చేసింది. వీటి ధరలు రూ. లక్షలోపే తీసుకురావడం విశేషం.
వీటితో పాటు తన ఎస్1ప్రో సెకండ్ జనరేషన్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. రెండు బ్యాటరీ వేరియంట్లతో వచ్చిన ఓలా ఎక్స్1 ప్లస్ ధర రూ. 1.09 లక్షలు ఉండగా, లాంచింగ్ ఆఫర్‌తో రూ. 99,999కే విక్రయిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఆఫర్ ధర ఈ నెల 21 వరకు అందుబాటులో ఉండనుంది. 3 కిలోవాట్ ఎస్1 ఎక్స్ 2 కిలోవాట్ వేరియంట్ రూ. 10 వేలు తక్కువకు రూ. 79,999కి లభిస్తుంది. ఇది కూడా ఈ నెల 21 వరకే తగ్గింపు ఆఫర్‌తో వస్తుంది.
ఇక, 3 కిలోవాట్ అవర్ ఎస్1 ఎక్స్ కూడా ఆఫర్ కింద రూ. 99,999కి కొనుగోలు చేయవచ్చు. ఎస్1ప్రో సెకండ్ జనరేషన్ రూ. 1.47 లక్షల ధరకు అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఓలా తన ఈవీ మోటర్‌సైకిళ్లను కూడా ఆవిష్కరించింది. వీటిని 2024 చివరి నాటికి విడుదల చేయాలని భావిస్తోంది.
- Tags
- Ola