Ola Electric: మరోసారి ఓలా ఎలక్ట్రిక్‌కు షోకాజ్ నోటీసులు పంపిన సీసీపీఏ

by S Gopi |
Ola Electric: మరోసారి ఓలా ఎలక్ట్రిక్‌కు షోకాజ్ నోటీసులు పంపిన సీసీపీఏ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని ఓలా ఎలక్ట్రిక్‌కు మరోసారి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) షోకాజ్ నోటీసులు పంపింది. ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) నాణ్యత, సర్వీసులకు సంబంధించి భారీగా ఫిర్యాదులు రావడంపై సీసీపీఏ గత నెల విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అవసరమైన డాక్యుమెంట్లు, ఇతర వివరాలను అందజేయాలని నోటీసులు జారీ చేసినట్టు ఓలా ఎలక్ట్రిక్ గురువారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. 15 రోజుల్లోగా అడిగిన వివరాలను ఇవ్వాలని సీఈపీసే తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీనికి బదులిచ్చిన ఓలా సీసీపీఏ కోరిన అదనపు డాక్యుమెంట్లతో పాటు అడిగిన సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని బదులిచ్చింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఓలా ఎలక్ట్రిక్ వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలు, మోసపూరిత ప్రకటనలు, అన్యాయమైన వ్యాపార పద్ధతులను అనుసరిస్తోందని, ఈవీల నాణ్యతో లోపాలు, సర్వీసులు సరిగా అందించడంలేదనే ఫిర్యాదులను ఎదుర్కొంది. ప్రధానంగా ఉచిత సర్వీసుతో పాటు ఛార్జింగ్, వారెంటీ, సరైన సేవలందించకపోవడం, లోపభూయిష్టమైన సర్వీసులు వంటివి పెరిగిపోవడంతో సీసీపీఏ నోటీసులు జారీ చేసింది. అయితే, దీనికి బదులిచ్చిన ఓలా 99 శాతానికి పైగా ఫిర్యాదులను పరిష్కరించామని వివరణ ఇచ్చింది.

Advertisement
Next Story

Most Viewed