Nykaa-Licious: క్విక్ కామర్స్ విభాగంలోకి నైకా, లిషియస్ ఎంట్రీ.. కేవలం 10 నిమిషాల్లో డెలివరీ..!

by Maddikunta Saikiran |
Nykaa-Licious: క్విక్ కామర్స్ విభాగంలోకి నైకా, లిషియస్ ఎంట్రీ.. కేవలం 10 నిమిషాల్లో డెలివరీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లో క్విక్ కామర్స్(Quick Commerce) విభాగం క్రమక్రమంగా విస్తరిస్తోంది. ఇది వరకే మన దేశంలో జొమాటో, బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్(Zomato, Blinkit, Zepto, Swiggy Instamart, BigBasket) క్విక్ కామర్స్ విభాగంలో రాణిస్తుండగా తాజాగా మరో రెండు సంస్థలు ఈ విభాగంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయ్యాయి. బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ కంపెనీ నైకా(Nykaa), డైరెక్ట్-టు-కన్స్యూమర్(Direct-to-consumer) మీట్ బ్రాండ్ లిషియస్(Licious) క్విక్ కామర్స్ విభాగంలోకి ఎంటర్ అయ్యాయి. నైకా ముంబై(Mumbai)లోని బోరివాలి(Borivali)లో 10 నిమిషాల డెలివరీ పైలట్‌ ప్రాజెక్ట్(Pilot project)ను ప్రారంభించింది. ఇక లిషియస్ గురుగ్రామ్(Gurugram)లోని ఎంపిక చేసిన ప్రాంతాలలో రెడీ-టు-ఈట్ మీల్స్(Ready-to-eat Meals) కోసం 15 నిమిషాల్లో డెలివరీలను పరీక్షిస్తున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా, ఫ్యాషన్ ప్లాట్‌ఫారమ్ మింత్రా(Fashion platform Myntra) కూడా క్విక్ కామర్స్ విభాగంలోకి ప్రవేశించింది. న్యూఢిల్లీ, బెంగళూరు(New Delhi, Bangalore) వంటి నగరాల్లో నాలుగు గంటల డెలివరీ సేవతో ప్రయోగాలు చేస్తోంది. త్వరలోనే మరికొన్ని నగరాల్లో ఈ సేవలను ప్రారంభించే అవకాశమున్నట్లు మింత్రా(Myntra) తెలిపింది. క్విక్ కామర్స్ విభానికి మన దేశంలో ఆదరణ పెరుగుతున్న కారణంగానే కంపెనీలు నిమిషాల్లో డెలివరీ అందించే సేవలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story