అదానీ గ్రూప్ షెల్ కంపెనీలు తమ దేశంలో లేవు: మారిషస్ ప్రభుత్వం!

by Harish |
అదానీ గ్రూప్ షెల్ కంపెనీలు తమ దేశంలో లేవు: మారిషస్ ప్రభుత్వం!
X

మారిషస్: హిండెన్‌బర్గ్ ఆరోపణలతో కుదేలైన దేశీయ అదానీ గ్రూప్ సంస్థకు ఊరట కలిగించేలా మారిషస్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అదానీ గ్రూపునకు చెందిన ఎలాంటి షెల్ కంపెనీలు తమ దేశంలో లేవని మారిషస్ ప్రభుతం స్పష్టం చేసింది. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ కంపెనీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని మారిషస్ ఆర్థిక మంత్రి మహేన్ కుమార్ సిరుత్తన్ చెప్పారు.

ఈ ఏడాది జనవరి మూడో వారంలో హిండెన్‌బర్గ్ కంపెనీ మారిషస్, యూఏఈ లాంటి దేశాల్లో షెల్ కంపెనీల ద్వారా అదానీ గ్రూపునకు చెందిన కంపెనీల షేర్లు కొనుగోళ్లు జరిగాయని, తద్వారా షేర్ విలువను పెంచుకున్నట్టు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అదానీ గ్రూప్ ఆరోపణలను ఖండించింది కూడా.

తాజాగా దానికి ఊతమిస్తూ మారిషస్ ప్రభుత్వం అక్కడి పార్లమెంటులో తాజా ప్రకటన చేసింది. మారిషస్ చట్టాల ప్రకారం, దేశంలో షెల్ కంపెనీలకు అనుమతి లేదని, ప్రభుత్వం స్థానిక ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తుందని వివరించింది.

Advertisement

Next Story

Most Viewed