- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడేళ్లలో 30 కొత్త కార్లు: నిస్సాన్
దిశ, బిజినెస్ బ్యూరో: వచ్చే మూడేళ్లలో కొత్తగా 30 మోడళ్లను విడుదల చేయనున్నట్టు ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ సోమవారం ప్రకటనలో వెల్లడించింది. లాభదాయకతను మెరుగుపరిచేందుకు ఖర్చులను తగ్గించుకుంటూనే నిర్దేశించిన సమయానికి 10 లక్షల వాహనాల అమ్మకాల లక్ష్యాన్ని సాధించాలని భావిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. అలాగే, గతేడాది ఫిబ్రవరిలో ప్రకటించిన ఈవీ లక్ష్యాలను మరింత పెంచుతున్నట్టు కంపెనీ పేర్కొంది. ఈ దశాబ్దం చివరి నాటికి గ్లోబల్ అమ్మకాల్లో 55 శాతం హైబ్రిడ్ వాహనాలే ఉండాలనే లక్ష్యాన్ని 60 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. భారత మార్కెట్లో ఎలక్టిక్ వాహనాలకు పెరుగుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకు ఇటీవలే నిస్సాన్, హోండా మోటార్స్ కలిసి వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ భాగస్వామ్యం భారత్‌తో పాటు ఇతర దేశాల్లో ఎగుమతులకు కూడా పనిచేసేందుకు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. రాబోయే మూడేళ్లలో నిస్సాన్ విడుదల చేయబోయే 30 కొత్త మోడళ్లలో 16 ఎలక్టిక్ వాహనాలే ఉంటాయని నిస్సాన్ స్పష్టం చేసింది. ముఖ్యంగా నిస్సాన్ కొత్త ఈవీల ధరలను 30 శాతం తగ్గించి 2030 నాటికి సాంప్రదాయ ఇంధన వాహనాల ధరల స్థాయికి తీసుకురానున్నట్టు వెల్లడించింది.