Stock Market: వరుసగా రెండో రోజు నష్టాల్లో సూచీలు

by S Gopi |
Stock Market: వరుసగా రెండో రోజు నష్టాల్లో సూచీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతకుముందు సెషన్‌లో గ్లోబల్ మార్కెట్లు, రికార్డు గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణతో బలహీనపడిన సూచీలు బుధవారం రోజంతా స్థిరమైన ర్యాలీ చూశాయి. ఉదయం నష్టాలతో మొదలైన తర్వాత బలహీన ధోరణిలో ట్రేడయ్యాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు కొనసాగడం, గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాలను వెనక్కి తీసుకోవడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేశాయి. వీటితో పాటు కీలక బ్లూచిప్ స్టాక్స్‌తో పాటు బ్యాంకింగ్ రంగంలో అమ్మకాలు నష్టాలకు కారణమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 202.80 పాయింట్లు నష్టపోయి 82,352 వద్ద, నిఫ్టీ 81.15 పాయింట్ల నష్టంతో 25,198 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, ఫార్మా, మీడియా రంగాలు రాణించగా, మిగిలిన రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, హిందూస్తాన్ యూనిలీవర్, సన్‌ఫార్మా, ఆల్ట్రా సిమెంట్, సన్‌ఫార్మా, ఆల్ట్రా సిమెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.98 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed