గత ఐదేళ్లలో స్వచ్ఛందంగా మూతబడిన కంపెనీల సంఖ్య 96,000!

by Vinod kumar |
గత ఐదేళ్లలో స్వచ్ఛందంగా మూతబడిన కంపెనీల సంఖ్య 96,000!
X

న్యూఢిల్లీ: గడిచిన ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 96,000 కంపెనీలు స్వచ్ఛందంగా తమ కార్యకలాపాలను మూసేశాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, ఆర్థిక బలహీనత సహా వివిధ కారణాలతో వ్యాపారాలు మూతబడ్డాయి. మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2018, ఏప్రిల్ 1 నుంచి 2023, మార్చి ఆఖరు మధ్య నాటికి మొత్తం 96,261 కంపెనీలు స్వచ్ఛందంగా మూతబడ్డాయి.

అలాగే, ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్సీ కోడ్(ఐబీసీ) సెక్షన్ కింద మరో 510 కేసుల్లో ఎన్‌సీఎల్‌టీ తుది రిజల్యూషన్ ఆర్డర్లను ఆమోదించిందని డేటా పేర్కొంది. అంతేకాకుండా ఐబీసీ సెక్షన్ 59 కింద స్వచ్ఛంద మూసివేత కోసం 520 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, సెక్షన్ 248(2) ప్రకారం, స్వచ్ఛంద కార్పొరేట్ నిష్క్రమణ కోసం ఇంకా 11,037 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రిత్వ శాఖ సమాచారం వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed