Apple iPhone 15 Pro : ఐఫోన్ 15 ప్రో మోడల్‌లో దేశీయ నావిగేషన్ సిస్టం

by Harish |   ( Updated:2023-09-14 09:19:32.0  )
Apple iPhone 15 Pro : ఐఫోన్ 15 ప్రో మోడల్‌లో దేశీయ నావిగేషన్ సిస్టం
X

దిశ, వెబ్‌డెస్క్: యాపిల్ ఇటీవల 'వండర్‌లస్ట్' ఈవెంట్‌లో iPhone 15 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్లను ప్రత్యేకంగా USB టైప్-సి పోర్ట్, టైటానియం బాడీ, డైనమిక్ ఐలాండ్‌తో తీసుకొచ్చారు. వీటితో పాటు కెమెరాలను కొత్తగా అప్‌డేట్ చేశారు. అలాగే పాత మోడళ్లతో పోలిస్తే ఎక్కువ సమయం వాడుకునేలా మెరుగైన బ్యాటరీని కూడా అందించారు. అయితే వీటితో పాటు ఐఫోన్ 15 ప్రో మోడల్‌లకు ప్రత్యేకంగా ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (NavIC)ను అందించినట్లు తెలుస్తుంది. GPS నావిగేషన్ సిస్టమ్‌కు ప్రత్యామ్నాయంగా దీన్ని అందించారు. యాపిల్ ఫోన్లకు దేశీయ నావిగేషన్ సిస్టంను అందించడం ఇదే మొదటిసారి.

GPS అనేది అమెరికాకు చెందిన నావిగేషన్ సిస్టమ్. అయితే భారత్ సొంతంగా సైనిక, వాణిజ్య అవసరాల కోసం NavIC ను 2018 లో ఏర్పాటు చేసింది. ఇది ఎనిమిది ఉపగ్రహాలను కలిగి ఉంది. సరిహద్దుల నుండి 1,500 కి.మీ వరకు విస్తరించి ఉన్న భారత భూభాగం ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. భారత్ ప్రభుత్వం చాలా కాలంగా దీన్ని వాడుతుంది. దీన్ని అంతరిక్ష సంస్థ ఇస్రో అభివృద్ధి చేసింది. NavIC ను ప్రోత్సహించాలని భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు యాపిల్ తోడ్పాటు అందించడం చాలా గొప్ప విషయం అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

Next Story