- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
నారాయణ మూర్తి 70 గంటల వర్క్‌కల్చర్‌పై నెటిజన్ల ఆగ్రహాం!
దిశ, వెబ్‌డెస్క్: భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై నెటిజన్లు దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పటికే జీతాలు తక్కువగా ఉన్నాయి. పని భారం మరింత పెరిగినట్లయితే వ్యక్తిగత జీవితాన్ని కూడా నష్టపోవాల్సి వస్తుందని, ముందుగా పనికి తగ్గట్టుగా వేతనాలు ఇవ్వాలని ఆయనను ట్రోల్ చేస్తున్నారు. 70 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా, కానీ అందుకు తగిన జీతం ఇస్తారా అంటూ ఒక నెటిజన్ ప్రశ్నించాడు.
మరోకరు 2005 లో ఇచ్చే ప్రారంభ వేతనాన్ని 2023లోనూ అంతే ఇస్తున్నారు. దీని వలన అవసరాలు ఎలా గట్టెక్కుతాయి, ఎక్కువ వేతనం చెల్లించినట్లయితే అంచనాలకు మించి ఎక్కువ పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. మరికొంత మంది మాత్రం ఆయన అభిప్రాయానికి సపోర్ట్‌గా నిలిస్తున్నారు.
నారాయణ మూర్తి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్న వారిలో ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ సైతం చేరారు. తక్కువ సమయం పని చేయడం వలన వెనుకబడిపోతామని, మనం ఇప్పుడు మరింత ఎక్కువ గంటలు కష్టపడాలని అన్నారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నారాయణ మూర్తి రెండో ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ, జపాన్ దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో మనం కూడా అలాగే శ్రమించాలని దీనికి ముఖ్యంగా యువత 70 గంటలు ఎక్కువ పనిచేయాలని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.