Jio Financial: అలియాంజ్‌తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటుకు జియో చర్చలు

by S Gopi |
Jio Financial: అలియాంజ్‌తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటుకు జియో చర్చలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, జర్మనీ సంస్థ అలియాంజ్ ఎస్ఈతో జాయింట్ వెంచర్‌ ఏర్పాటు కోసం చర్చలు జరుపుతోంది. అలియాంజ్ సంస్థ ఇప్పటికే భారత్‌లో ఉన్న రెండు జాయింట్ వెంచర్‌లను రద్దు చేయాలని చూస్తున్న నేపథ్యంలో అలియాంజ్‌తో కలిసేందుకు జియో పనిచేస్తోంది. ఇరు సంస్థలు కలిసి జీవిత బీమాతో పాటు సాధారణ బీమా సేవల కంపెనీని ఏర్పాటు చేయాలని జియో భావిస్తోంది. ఇది దక్షిణాసియా మొత్తం కార్యకలాపాలను నిర్వహించనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. అలియాంజ్ సంస్థ దేశీయంగా బజాజ్ ఫిన్‌సర్వ్ కంపెనీతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఇటీవల బజాజ్ ఒప్పందం నుంచి బయటకు రావాలని చూస్తోంది. అయితే, అలియాంజ్ సంస్థ మాత్రం భారత మార్కెట్లో కొనసాగేందుకు సుముఖంగా ఉంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న బీమా రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు జియో ప్రయత్నిస్తోంది.

Advertisement

Next Story