- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Assam: అస్సాంలో రిలయన్స్, అదానీ గ్రూప్ రూ. లక్ష కోట్ల పెట్టుబడులు

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ అస్సాం రాష్ట్రంలో భారీగా పెట్టుబడులను ప్రకటించారు. వివిధ రంగాల్లో రూ. 50,000 కోట్ల చొప్పున ఇరు సంస్థల అధినేతలు పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించారు. మంగళవారం గౌహతిలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రా సమ్మిట్‌లో వారు ఈ ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, రాష్ట్రంలో అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తూ, టెక్నాలజీ పవర్‌హౌస్‌గా మార్చాలని లక్ష్యంతో పెట్టుబడులు పెడుతున్నామని చెప్పారు. గతంలోనూ 2018 నాటి సమ్మిట్‌లో రూ. 5,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించామని, ఇప్పటివరకు అవి రూ. 12,000 కోట్లకు పెరిగాయి. వచ్చే ఐదేళ్లలో రూ. 50 వేల కోట్లు పెట్టాలని భావిస్తున్నాం. ప్రధానంగా భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ)లో అస్సాం యువత కీలక పాత్ర పోషిస్తుందని, దీనికోసం ఏఇ రెడీ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు ముఖేష్ అంబానీ చెప్పారు. అలాగే, రెండు ప్రపంచ స్థాయి కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) హబ్‌లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీనివల్ల ఏటా 8 లక్షల టన్నుల స్వచ్ఛమైన బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుందని, ప్రతిరోజు 2 లక్షల ప్యాసింజర్ కార్లకు ఇంధనం అందుతుందని ఆయన చెప్పారు. మెగా ఫుడ్ పార్క్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇక, గౌతమ్ అదానీ రాష్ట్రంలో విమానాశ్రయాలు, ఏరో-సిటీలు, సిటీ గ్యాస్ పంపిణీ, ట్రాన్స్‌మిషన్లు, సిమెంట్, రోడ్ ప్రాజెక్టులతో సహా వివిధ రంగాల్లో రూ. 50,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించారు.