MSMEs: ఎలాంటి హామీ లేకుండా ఎంఎస్ఎంఈలకు రూ. 100 కోట్ల వరకు రుణాలు

by S Gopi |
MSMEs: ఎలాంటి హామీ లేకుండా ఎంఎస్ఎంఈలకు రూ. 100 కోట్ల వరకు రుణాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రూ. 100 కోట్ల వరకు పూచీకత్తు లేని రుణాలను ఇవ్వనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ రుణాలు కొత్త క్రెడిట్ అసెస్‌మెంట్ మోడల్ ద్వారా లభిస్తాయని ఓ ప్రకటనలో తెలిపారు. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిసి దీన్ని అమలు చేస్తాయని చెప్పారు. బెంగళూరులో జరిగిన నేషనల్ ఎంఎస్ఎంఈ క్లస్టర్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో మాట్లాడిన ఆర్థిక మంత్రి.. త్వరలో కేబినెట్ కొత్త క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఎంఎస్ఎంఈల సమస్యలను పరిష్కరించనున్నట్టు చెప్పారు. ఎంఎస్ఎంఈలు బ్యాంకుల నుంచి రుణాలు పొందుతాయని, టర్మ్ లోన్, ప్లాంట్, మెషినరీలకు రుణాలు అందడంలేదనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రుణాలు తీసుకునేందుకు ఎలాంటి థర్డ్ పార్టీ గ్యారెంటీ అవసరంలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వమే 100 కోట్ల వరకు గ్యారెంటీ ఇస్తుందని ఆర్థిక మంత్రి అన్నారు. కొత్త క్రెడిట్ అసెస్‌మెంట్ మోడల్‌ను బ్యాంకులు అభివృద్ధి చేస్తాయని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed