- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
PM Modi: ట్రంప్ ధోరణితో తక్కువ సుంకాలు, ఎక్కువ దిగుమతులకు సానుకూలంగా భారత ప్రభుత్వం

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా పన్నులకు సంబంధించి ట్రంప్ ధోరణి అనేక దేశాలతో పాటు భారత్‌లోనూ చర్చనీయాంశమైంది. డాలర్ విలువను తగ్గించే ప్రయత్నాలు చేస్తే బ్రిక్స్ దేశాలపై 100 శాతం పన్ను అమలు చేసేందుకు సిద్ధమని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం వాణిజ్య ఒప్పందంతో పాటు సుంకం తగ్గింపు, అమెరికా నుంచి ఎక్కువ వస్తువుల దిగుమతి చేసుకోవడం వంటి అంశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ కొత్త ప్రభుత్వం తీసుకునే ఏ చర్యల వల్లనైనా భారత్, యూఎస్ వాణిజ్యం ప్రభావితం కాకుండా ఉండేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలోని అధికారులు వివిధ అవకాశాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. దీన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం నుంచి మరిన్ని ఉక్కు, చమురు, విస్కీ కొనుగోలు చేయనున్నట్టు సమాచారం. సోయాబీన్, డైరీ, వాహనాలు, వైద్య పరికరాలు, విమానాలతో సహా వివిధ రంగాల నుంచి కొనుగోళ్లు పెంచడం. అలాగే, అమెరికాలోని రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై సుంకాలు తగ్గించాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద ఉందని సంబంధిత వ్యక్తులు చెప్పారు. ఈ అంశాలు ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్నాయని, ట్రంప్ ప్రభుత్వంతో వాణిజ్య సవాళ్లను తగ్గించే వ్యూహంలో భాగంగానే వీటిపై నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు.