ఈ ఏడాది ప్రీ-ఓన్‌డ్ విభాగంలో 20 శాతం అమ్మకాలు: మెర్సిడెస్ బెంజ్!

by Javid Pasha |
ఈ ఏడాది ప్రీ-ఓన్‌డ్ విభాగంలో 20 శాతం అమ్మకాలు: మెర్సిడెస్ బెంజ్!
X

న్యూఢిల్లీ: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో దూకుడు పెంచాలని భావిస్తోంది. ఈ ఏడాది కంపెనీ మొత్తం అమ్మకాల్లో 20 శాతం వరకు ప్రీ-ఓన్‌డ్ కార్లను విక్రయించాలని లక్ష్యంగా ఉంది. అయితే, డిమాండ్ స్థాయిలో ప్రీ-ఓన్‌డ్ కార్లు అందుబాటులో లేకపోవడం పెద్ద సవాలుగా ఉందని కంపెనీ చెబుతోంది. గతేడాది కంపెనీ మొత్తం 3 వేలకు పైగా యూజ్‌డ్ కార్లను విక్రయించింది. గతంలో ప్రీ-ఓన్‌డ్ కార్ల కంపెనీ వద్ద ఉండే సమయంలో 35-45 రోజులు ఉండగా, ఇప్పుడు 10 రోజులకు తగ్గడం భారీ గిరాకీని సూచిస్తుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సంతోష్ అయ్యర్ అన్నారు.

పెర్గుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని ప్రీ-ఓన్‌డ్ కార్లను సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కొత్త కార్ల కోసం మూడు నుంచి ఆరు నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండగా, ప్రీ-ఓన్‌డ్ కార్లు అందుబాటులో ఉండటంతో ఎక్కువమంది వీటినే కొంటున్నారు. కంపెనీ ప్రీ-ఓన్‌డ్ పోర్ట్‌ఫోలియోలో బెంచ్ ఈ-క్లాస్ మోడళ్లు అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. ఈ ఏడాదిలోనూ ప్రీ-ఓన్‌డ్ కార్ల అమ్మకాలు అదే స్థాయిలో జరుగుతాయని సంతోష్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. కాగా, కంపెనీ 'మెర్సిడెస్ బెంజ్ సర్టిఫైడ్' ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రీ-ఓన్‌డ్ కార్లను విక్రయిస్తోంది.


Advertisement

Next Story