- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Mercedes Benz నుంచి కొత్త మోడల్.. ధర తెలిస్తే షాక్..

దిశ, వెబ్‌డెస్క్: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియాలో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘AMG G 63 గ్రాండ్ ఎడిషన్’. ఈ SUV ధర రూ.4 కోట్లు (ఎక్స్-షోరూమ్). డెలివరీలు 2024 ప్రథమార్థంలో జరుగుతాయి. ఈ మోడల్‌ను లిమిటెడ్ ప్రాతిపదికన విక్రయించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1000 యూనిట్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. అదే భారత్‌లో 25 మాత్రమే అమ్మనున్నారు. AMG G 63 గ్రాండ్ ఎడిషన్ మోడల్ 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజన్‌తో 585hp శక్తిని, 850Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.5 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది. దీని గరిష్ట వేగం 220 kmph. దీని డిజైన్ సరికొత్తగా ఉంటుంది. మెర్సిడెస్ లోగో, AMG లోగో కొత్తగా ఉంటుంది. లోపల లెదర్ సీట్లు, భద్రతాపరమైన ఫీచర్లను అందించారు.
ఇవి కూడా చదవండి : రూ.80 వేలకే కొత్తగా Honda Activa లిమిటెడ్ ఎడిషన్!