భారత్‌లో చిప్ తయారీకి గ్లోబల్ కంపెనీల చర్చలు!

by Vinod kumar |
భారత్‌లో చిప్ తయారీకి గ్లోబల్ కంపెనీల చర్చలు!
X

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన మెమొరీ చిప్ తయారీ సంస్థ మైక్రోన్ టెక్నాలజీస్ భారత్‌లో పెట్టుబడులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే బాటలో అనేక సెమీకండక్టర్ కంపెనీలు దేశంలో తయారీ ప్లాంటులను నెలకొల్పేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఓ ఇంటర్యూలో చెప్పారు. అంతర్జాతీయంగా మెమొరీ చిప్‌ల తయారీ దిగ్గజ సంస్థలు భారత్‌ను అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్, తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రంగా చూస్తున్నాయి. భారీగా పెట్టుబడులకు కూడా ప్రయత్నిస్తున్నాయని మంత్రి తెలిపారు.

ఇటీవల వేదాంత-ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్ విడిపోవడంతో కొంత ప్రతికూలతే అయినప్పటికీ, దీర్ఘకాలంలో భారత్‌కు ఇబ్బందికరమేమీ కాదని, భవిష్యత్తులో మరిన్ని చిప్ తయారీ కంపెనీలు భారత్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహించనున్నాయని ఆయన వివరించారు. సెమీకండక్టర్ల డిజైన్ కంపెనీల కోసం డిజైన్-లింక్‌డ్ ఇన్సెంటివ్(డీఎల్ఐ) పథకాన్ని ప్రభుత్వం విస్తరించే అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమ వర్గాల సూచన మేరకు విదేశీ, దేశీయ బడా సంస్థలకూ ఈ పథకాన్ని అందించాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed