BSA Goldstar 650: రాయల్ ఎన్ఫీల్డ్ కు పోటీగా మహీంద్రా గోల్డ్ స్టార్ 650

by M.Rajitha |   ( Updated:2024-08-15 15:38:05.0  )
BSA Goldstar 650: రాయల్ ఎన్ఫీల్డ్ కు పోటీగా మహీంద్రా గోల్డ్ స్టార్ 650
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలో అతి పురాతన మోటార్ సైకిల్ బ్రాండ్లలో ఒకటైన బీఎస్ఏ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దేశీయ విపణిలోని ప్రీమియం మోటార్ సైకిల్ సెగ్మెంట్లలో రాయల్ ఎన్ఫీల్డ్ కు ఇక గట్టి పోటీ ఉండనుంది. బర్మింగ్ హామ్ స్మాల్ ఆర్మ్స్ కంపెనీ(బీఎస్ఏ)ని 2016లో మహీంద్రా గ్రూపుకు చెందిన ప్రీమియం మోటార్ సైకిల్ విభాగం క్లాసిక్ లెజెండ్స్ బీఎస్ఏను కొనుగోలు చేసింది. తొలిసారిగా 2021లో ఈ బీఎస్ఏ నుండి గోల్డ్ స్టార్ 650 ని యూకేలో లంచ్ చేశారు. ప్రస్తుతం యూరప్, తుర్కీయే, న్యూజిలాండ్, ఫిలిప్పీన్ వంటి దేశాల్లో మాత్రమే వీటిని విక్రయిస్తున్నారు. తాజాగా బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 ని భారత్ లోకి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆనంద్ మహయిదర మాట్లాడుతూ.. భారత్ లోకి బీఎస్ఏను తీసుకురావడం అంటే ప్రపంచ మోటార్ సైకిల్ చరిత్రను భారత్ తో పంచుకోవడమే అన్నారు. ఇక ఈ బైక్ వివరాల్లోకి వెళితే.. బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 ధర రూ.2.99 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. కలర్ ఆప్షన్ బట్టి ధర మారుతూ ఉంటుంది. ఇందులో 652 సీసీ ఇంజిన్ ఉండగా.. 45 బిహెచ్పీ పవర్, 55 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ గంటకు గరిష్టంగా 165 కిమీ వేగంతో ప్రయాణించగలదు.

Advertisement

Next Story

Most Viewed