- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
20 శాతం తగ్గిన ఎల్ఐసీ డెత్ క్లెయిమ్‌లు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజ బీమా సంస్థ ఎల్ఐసీ డెత్ క్లెయిమ్‌లు 20 శాతం తగ్గాయని ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టడంతోనే డెత్ క్లెయిమ్‌లు క్షీణించాయని ఎల్ఐసీ ఛైర్మన్ ఎం ఆర్ కుమార్ అన్నారు. అయితే, ప్రస్తుత డెత్ క్లెయిమ్‌లు 2020కి ముందు స్థాయిల కంటే ఎక్కువగానే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో మొత్తం రూ. 7,111 కోట్ల విలువ డెత్ క్లెయిమ్‌లు అందించామని, అది ఈ ఏడాదిలో రూ. 5,743 కోట్లుగా ఉన్నాయని కుమార్ వివరించారు. కరోనా మహమ్మారికి ముందు సమయంలో డెత్ క్లెయిమ్‌లు స్థిరంగా ఉండేవని, ఈ రెండేళ్ల కాలంలో ఇవి అనూహ్యంగా పెరిగాయని ఎల్ఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దినేస్ చెప్పారు. ప్రస్తుతం క్లెయిమ్‌లు తగ్గుతున్నప్పటికీ, కోవిడ్‌కి ముందునాటికి చేరుకోలేదు, ఇందుకు మరో ఏడాది సమయం పడుతుందని అంచనా వేస్తున్నట్టు ఆయన తెలిపారు.