- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ బ్యాంక్ కస్టమర్లకు ఈ నెల 24 వరకే లాస్ట్ చాన్స్.. లేకపోతే ఖాతా పనిచేయదు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా తన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. తమ బ్యాంకులో అకౌంట్ కలిగిన ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా సీ-కేవైసీ (Know your customers)ను పూర్తి చేయాలని పేర్కొంది. దీని చివరి గడువు మార్చి 24 గా పేర్కొంది. ఈ తేదీలోపు ఖాతాదారులు తమ సీ-కేవైసీని పూర్తి చేయనట్లయితే వారి అకౌంట్లు పనిచేయవని, అన్ని సేవలు నిలిచిపోతాయని బ్యాంక్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది.
గతంలో ఈకేవైసీ ఉండగా, ఇప్పుడు సీకేవైసీ ద్వారా వినియోగదారుల డాక్యుమెంట్లను డిజిటల్ ఫార్మాట్‌లో భద్రపరిచి అవసరమైనప్పుడు వినియోగిస్తున్నారు. కొత్తగా అకౌంట్ తీసుకున్న వారు ప్రతిసారీ కేవైసీ పూర్తి చేయాల్సిన అవసరం లేకుండా ఒకేసారి వెరిఫికేషన్ పూర్తి చేయడమే దీని ఉద్ద్యేశం. సీ-కేవైసీ (Central KYC procedure)కి సంబంధించి బ్యాంకు అధికారుల నుంచి కాల్స్ లేదా మెసేజ్‌లు వచ్చినప్పుడు దగ్గరలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచుల్లో సంప్రదించగలరని బ్యాంకు పేర్కొంది.