- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొత్త కస్టమర్‌లను తీసుకోకుండా కోటక్ మహీంద్రా బ్యాంకుపై ఆర్‌బీఐ నిషేధం
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంకుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) షాక్ ఇచ్చింది. బ్యాంకు తన ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కొత్త వినియోగదారులను తీసుకోకుండా, కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా నిషేధం విధిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ప్రస్తుతం బ్యాంకు క్రెడిట్ కార్డు కస్టమర్లతో పాటు అన్ని రకాల సేవలను కొనసాగించవచ్చని తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఆర్‌బీఐ ముందస్తు అనుమతితో బ్యాంకు సమగ్ర ఎక్స్‌టర్నల్ ఆడిట్ పూర్తయిన తర్వాత, అన్ని లోపాలను అలాగే తమ తనిఖీలలో ఉన్న పరిశీలనలను, తమను సంతృప్తిపరిచేలా పరిష్కరించిన అనంతరం నిషేధంపై సమీక్ష చేపడతామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 2022, 2023 సంవత్సరాలకు సంబంధించి ఆర్‌బీఐ ఐటీ పరీక్షల నుంచి ఉత్పన్నమయ్యే ఆందోళనలు, సమస్యలను పరిష్కరించడంలో బ్యాంకు విఫలమైన కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆర్‌బీఐ పేర్కొంది. ఐటీ ఇన్వెంటరీ మేనేజ్‌మెట్, యూజర్ యాక్సెస్ మేనేజ్‌మెంట్, బిజినెస్ కంటిన్యూటీ సహా వివిధ అంశాల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయి. నియంత్రణ మార్గదర్శకాల కింద ఉన్న అవసరాలకు విరుద్ధంగా వరుస రెండేళ్లు బ్యాంకు ఐటీ రిస్క్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గవర్నెన్స్‌లో లోపాలు ఉన్నట్టు గుర్తించామని ఆర్‌బీఐ వెల్లడించింది.