సొనాటా ఫైనాన్స్‌ను కొనుగోలు చేసిన కోటక్ మహీంద్రా బ్యాంక్

by Disha Web Desk 17 |
సొనాటా ఫైనాన్స్‌ను కొనుగోలు చేసిన కోటక్ మహీంద్రా బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: సొనాటా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ కోటక్ మహీంద్రా కొనుగోలు చేసింది. మొత్తం డీల్ విలువ రూ.537 కోట్లు. కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని సొనాటాపై యాజమాన్య హక్కులు కోటక్ మహీంద్రా బ్యాంక్ పొందినట్లు మార్చి 28న ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొన్నారు. దీంతో సొనాటా కార్యకలాపాలు అన్ని కూడా కోటక్ బ్యాంక్ క్రింద నిర్వహించబడతాయి. సొనాటా ఫైనాన్స్ అనేది నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)లో రిజిష్టర్ అయి ఉంది. కంపెనీ 10 రాష్ట్రాల్లో 549 బ్రాంచ్‌ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. డిసెంబర్ 31, 2023 నాటికి సుమారు రూ. 2,620 కోట్ల అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (AUM)ని కలిగి ఉంది. ఇంతకుముందు అక్టోబర్ 2023లో కమ్యూనికేట్ చేసినట్లుగా, బ్యాంక్ సొనాటాను కొనుగోలు చేయాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఈ కొనుగోలు ప్రక్రియకు RBI ఆమోదించింది. తాజాగా ఇప్పుడు పూర్తయిందని కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రకటించింది.


Next Story

Most Viewed