Vijay Mallya: విజయ్ మాల్యా పిటిషన్‌పై బ్యాంకులకు నోటీసులు జారీ చేసిన కర్ణాటక హైకోర్టు

by S Gopi |
Vijay Mallya: విజయ్ మాల్యా పిటిషన్‌పై బ్యాంకులకు నోటీసులు జారీ చేసిన కర్ణాటక హైకోర్టు
X

దిశ, బిజినెస్ బ్యూరో: బ్యాంకులకు రుణాలు ఎగవేసి దేశం నుంచి వెళ్లిపోయిన విజయ్ మాల్యా కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. తాను బ్యాంకులకు చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ మొత్తం వసూలు చేశాయని, దానికి సంబంధించిన అకౌంట్ స్టేట్‌మెంట్లను ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. పిటిషన్‌పై స్పందించిన కర్ణాటక హైకోర్టు బుధవారం బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. తన నుంచి వసూలు చేసిన మొత్తంతో పాటు ప్రస్తుతం లిక్విడేషన్‌లో ఉన్న యూబీహెచ్ఎల్ కంపెనీల నుంచి బ్యాంకులు వసూలు చేసిన వాటి వివరాలు ఇవ్వాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. విజయ్ మాల్యా తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సాజన్ పూవయ్య.. కింగ్‌ఫిషన్ ఎయిర్‌లైన్స్ రూ. 6,200 కోట్ల అప్పులను తీసుకుంది. ఈ వ్యవహారంలో రూ. 14,131 కోట్లను రికవరీ చేశాయి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో చెప్పారని సాజన్ చెప్పారు. అదనంగా రూ.10,200 కోట్లు రికవరీ చేశారని వాదించారు. ఉన్న అప్పంతా చెల్లించినప్పటికీ రికవరీ ప్రక్రియ కొనసాగుతోందని, విజయ్ మాల్యా వ్యవహారంలో స్టే ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఎస్‌బీఐతో పాటు తొమ్మిది బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఫిబ్రవరి 13లోగా స్పందించాలని స్పష్టం చేసింది. కాగా, దేశీయ బ్యాంకులకు రూ. వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారనే ఆరోపణలు విజయ్ మాల్యాను భారత్‌కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Next Story