- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎన్నికల తర్వాత భారత మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల వరద
దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థికవ్యవస్థ వృద్ధి వేగంగా ఉండటం, అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లకు సంబంధించిన నిర్ణయాల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత భారత మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తనున్నాయని ఇన్వెస్టిమెంట్ బ్యాంకింగ్ కంపెనీ జేపీ మోర్గాన్ తెలిపింది. ప్రస్తుతం భారత మార్కెట్లలో గ్లోబల్ ఫండ్ సంస్థలు తమ హోల్డింగ్‌లను స్థిరంగా కొనసాగిస్తున్నాయి. అధిక వాల్యూయేషన్‌ల నుంచి మార్కెట్లు దిగొస్తే కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నాయని జేపీ మోర్గాన్‌కు చెందిన రాజీవ్ బాత్రా అభిప్రాయపడ్డారు. గత కొన్నేళ్ల నుంచి భారత మార్కెట్ల వాల్యూయేషన్ విషయంలో విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. ఈ క్రమంలో దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు విదేశీ మదుపర్ల పెట్టుబడులు మరింత అస్థిరంగా ఉండవచ్చు. గడిచిన రెండున్నరేళ్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు ప్రధానంగా భారత్‌లో జరుగుతున్న సంస్కరణలపై మాత్రమే దృష్టి పెట్టారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడున్న విధానాల కొనసాగింపు, మూలధన పెట్టుబడులు, మౌలిక సదుపాయాల వ్యయం వంటి అంశాల ప్రభావంతో ఎన్నికల తర్వాత దేశీయ స్టాక్స్‌లో వారు భారీగా నిధులను తరలించవచ్చని రాజీవ్ బాత్రా వివరించారు.