- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
JioBharat J1: లైవ్ టీవీ ఫీచర్‌తో రూ. 1,799కే మరో 4జీ ఫోన్ విడుదల చేసిన జియో
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టెలికాం బ్రాండ్ జియో తన కొత్త జియో భారత్ 4జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. జియో భారత్ జే1 పేరుతో తీసుకొచ్చిన ఈ ఎంట్రీ లెవల్ ఫీచర్ ఫోన్‌లో జియో టీవీతో పాటు పలు ప్రీ-ఇన్‌స్టాల్‌డ్ యాప్స్ ఉంటాయి. రూ. 1,700కే విడుదల చేసిన ఈ ఫోన్‌ను ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను అమెజాన్‌తో పాటు రిలయన్స్ డిజిటల్, జియోమార్ట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చని కంపెనీ వెల్లడించింది. కీబోర్డుతో వస్తున్న ఈ ఫోన్ 2.8 అంగుళాల డిస్‌ప్లే, 0.13 జీబీ స్టోరేజ్, 128జీబీ ఎస్‌డీ కార్డు, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 3.5 ఎంఎం కలిగి ఉంటుంది. అంతేకాకుండా యూపీఐ చెల్లింపులు, లైవ్ టీవీ వంటి సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయని కంపెనీ పేర్కొంది. లైవ్ టీవీలో 455 టీవీ ఛానళ్లు ప్రసారమవుతాయి. క్యూఆర్ కోడ్ స్కానింగ్ కోసం డిజిటల్ కెమెరా కూడా ఈ ఫోన్‌లో అమర్చారు. హెచ్‌డీ ఫోన్ కాలింగ్, జియో సినిమా వంటి ఓటీటీ సేవల యాక్సెస్ కూడా ఉంది. అయితే, ఈ ఫోన్ జియో నెట్‌వర్క్‌పై మాత్రమే పనిచేస్తుంది. ఇతర టెలికాం నెట్‌వర్క్‌లు పనిచేయవు. ఈ ఫోన్ రీఛార్జ్ కోసం ప్రస్తుతం రూ. 189తో 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ అందుబాటులో ఉంది.