Jio New Year Plan: కస్టమర్లకు జియో బంపర్ ఆఫర్.. రూ. 2025తో న్యూఇయర్ వెల్‌కమ్ ప్లాన్..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-11 15:24:16.0  )
Jio New Year Plan: కస్టమర్లకు జియో బంపర్ ఆఫర్.. రూ. 2025తో న్యూఇయర్ వెల్‌కమ్ ప్లాన్..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో(Reliance Jio) తన కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను ప్రవేశ పెడుతున్న సంగతి తెలిసిందే. నూతన సంవత్సరం(New Year) సందర్భంగా వినియోగదారుల కోసం మరో కొత్తప్లాన్(New Plan)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 'న్యూ ఇయర్ వెల్‌కమ్ ప్లాన్ 2025’ పేరుతో దీన్ని ప్రవేశపెట్టింది. రూ. 2025 రీఛార్జి ప్లాన్ పై లాంగ్ టర్మ్ వ్యాలిడిటీ(Long Term validity)తో పాటు రూ. 2,150 విలువైన కూపన్ల(Coupons)ను అందిస్తోంది. అయితే డిసెంబర్ 11,2024 నుంచి జనవరి 11,2025 మధ్య రీఛార్జి చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని జియో వెల్లడించింది. మై జియో యాప్(My Jio App)నుంచి గానీ, జియో అధికారిక వెబ్‌సైట్(Jio Website) ద్వారా గానీ రీఛార్జి చేసుకోవచ్చని తెలిపింది.

రూ. 2025 రీఛార్జి ప్లాన్‌లో ప్రయోజనాలు:

  • 200 రోజుల అన్‌లిమిటెడ్ 5G డేటా.
  • డైలీ 2.5 జీబీ చొప్పున మొత్తం 500GB డేటా లభిస్తుంది.
  • అపరిమిత వాయిస్ కాల్‌లు, SMSలు లభిస్తాయి.
  • రూ.2150 విలువైన అదనపు ప్రయోజనాలు.
  • ఈ ప్లాన్ నెలవారీ రూ.349 ప్యాకేజీతో పోలిస్తే రూ.468 పొదుపు చేసుకోవచ్చు.

రూ. 2150 విలువైన కూపన్ ప్రయోజనాలు:

  • రూ.500 AJIO కూపన్: రూ.2500 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్లపై ఈ కూపన్ యూజ్ చేసుకోవచ్చు.
  • స్విగ్గీలో రూ. 499 ఫుడ్ ఆర్డర్‌పై రూ. 150 కూపన్.
  • ఈజ్ మై ట్రిప్ యాప్ లో ఫ్లైట్ టికెట్ల బుకింగ్ పై రూ.1500 తగ్గింపు లభిస్తుంది.
Advertisement

Next Story

Most Viewed