- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు కొత్త కార్లను తీసుకొచ్చిన జీప్ ఇండియా!
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ జీప్ ఇండియా తమ ఎస్యూవీ మోడల్ మెరిడియన్‌లో రెండు ప్రత్యేక ఎడిషన్లను విడుదల చేసింది. ప్రధానంగా దేశంలోని లగ్జరీ కార్ల అమ్మకాలు పెరుగుతున్న తరుణంలో ప్రీమియం కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీ కొత్త వాహనాల వేరియంట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
సరికొత్తగా తీసుకొచ్చిన మెరిడియన్ ఎక్స్, మెరిడియన్ అప్ల్యాండ్లు అత్యాధునిక ఫీచర్లతో పాటు కొత్త స్టైలింగ్, సిల్వర్ మూన్, గెలాక్సీ బ్లూ వంటి రంగుల్లో అందుబాటులో ఉంటాయి. ఈ కార్ల ప్రారంభ ధర రూ. 32.95 లక్షలుగా నిర్ణయించామని, జీప్ మెరిడియన్ ప్రత్యేక ఎడిషన్ల కోసం ఇప్పటికే బుకింగ్‌లను కూడా ప్రారంభించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
మెరిడియన్ అప్ల్యాండ్ వేరియంట్ ముఖ్యంగా ఆఫ్‌రోడ్ ప్రయాణానికి అత్యంత అనువుగా ఉంటుందని, కారులో స్ప్లాష్ గార్డ్, బూట్ ఆర్గనైజర్, సన్షేడ్లు, ప్రత్యేక కేబిన్, కార్గో మ్యాట్స్, టైర్ ఇన్‌ఫ్లేటర్ వంటి ఎన్నో సౌకర్యాలను అందించినట్టు జీప్ బ్రాండ్ ఇండియా హెడ్ నిపుణ్ జె మహజన్ చెప్పారు. కాగా, పరిశ్రమ అంచనాల ప్రకారం, ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే దేశీయంగా 9,500 కంటే ఎక్కువ లగ్జరీ కార్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఇది గతేడాది కంటే 10 శాతం ఎక్కువ.
Also Read..