- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కోటక్ మహీంద్రా గ్రూప్ ప్రెసిడెంట్‌గా జైదీప్ హన్స్‌రాజ్ నియామకం
దిశ, బిజినెస్ బ్యూరో: కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు పూర్తిగా అనుబంధంగా ఉన్న కోటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్(KSL) ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జైదీప్ హన్స్‌రాజ్‌ను గ్రూప్ ప్రెసిడెంట్‌గా నియమించినట్లు శుక్రవారం జరిగినటువంటి డైరెక్టర్ల బోర్డు మీటింగ్‌లో పేర్కొన్నారు. తమ కస్టమర్లకు మరిన్ని సేవలు అందించడానికి, వన్ కోటక్‌ను ముందుకు నడపడానికి ఈ నియామకం ఉపయోగపడుతుందని బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. జైదీప్ స్థానంలో కోటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీపాల్ షా బాధ్యతలు స్వీకరిస్తారు. జైదీప్1993లో కోటక్ మహీంద్రా గ్రూప్‌లో చేరారు. ప్రస్తుత పదవిలో జులై 15, 2019 నుంచి ఉన్నారు. గతంలో జైదీప్ కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో వెల్త్ మేనేజ్‌మెంట్, ప్రాధాన్య బ్యాంకింగ్ సీఈఓగా ఉన్నారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అశోక్ వాస్వానీ మాట్లాడుతూ, జైదీప్ హన్స్‌రాజ్ మూడు దశాబ్దాలుగా సంపాదించిన తన గొప్ప అనుభవంతో గ్రూప్‌ను వృద్ధి పథంలో నడిపిస్తారని అన్నారు.