- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bissel: ఆరేళ్ల తర్వాత అమెరికన్ హోమ్‌కేర్ బ్రాండ్ భారత మార్కెట్లో రీ-ఎంట్రీ
దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన హోమ్‌కేర్ సొల్యూషన్స్ ప్రొవైడర్ బిస్సెల్ భారత మార్కెట్లో రీ-ఎంట్రీ ఇవ్వనుంది. ఆరేళ్ల క్రితం భారత్ మార్కెట్‌కు గుడ్‌బై చెప్పిన కంపెనీ తిరిగి రావాలని భావిస్తోంది. భవిష్యత్తులో భారత్ ముఖ్యమైన మార్కెట్‌గా మారుతుందని ఆశిస్తున్నామని బిస్సెల్ అధికారిక ప్రకటనలో తెలిపింది. హోమ్‌కేర్ సొల్యూషన్స్ విభాగంలో భారత్ చిన్న మార్కెట్ అయినప్పటికీ జనాభా, పెరుగుతున్న ఆర్థికవ్యవస్థ వృద్ధిని పరిశీలిస్తే భవిష్యత్తు కోసం పెట్టుబడులకు అవకాశం ఉందని కంపెనీ ప్రెసిడెంట్ మాక్స్ బిస్సెల్ చెప్పారు. దేశీయంగా కార్యకలాపాల కోసం కావిటక్ గ్లోబల్ కామర్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని బిస్సెల్ పేర్కొంది. ఈ కంపెనీ పోర్టబుల్ వెట్, డ్రై వాక్యూమ్ క్లీనింగ్ సిస్టమ్‌లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఉత్పత్తులు ఇప్పటికే అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయని బిస్సెల్ పేర్కొంది. భారత మార్కెట్లో ఎంట్రీ అర్వాత అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ పాట్‌ఫామ్‌లలో అమ్మకాలపై దృష్టి సారిస్తామని, అమ్మకాలు పెరిగిన తర్వాత ఆఫ్‌లైన్‌లోనూ విక్రయాలు ప్రారంభించనున్నట్టు వెల్లడించింది.