- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వరుసగా ఆరోసారి బడ్జెట్ సమర్పించనున్న నిర్మలమ్మ
దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌తో అరుదైన ఘనతను సాధించనున్నారు. భారత మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా రికార్డులకు ఎక్కనున్నారు. 1959-64 మధ్యకాలంలో మొరార్జీ దేశాయ్ ఐదు సమగ్ర బడ్జెట్‌లతో పాటు ఒక మధ్యంతర బడ్జెట్‌ను ప్రకటించారు. ఇప్పటికే ఐదుసార్లు పూర్తి బడ్జెట్‌ను ప్రకటించిన నిర్మలా సీతారామన్, ఈ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకు ఐదుసార్లు కేంద్ర బడ్జెట్‌లను తీసుకొచ్చిన అరుణ్ జైట్లీ, పి చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్‌లను ఆమె అధిగమించనున్నారు.
దేశ మొట్టమొదటి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ 2019, జూలై నుండి ఐదు పూర్తి బడ్జెట్‌లను సమర్పించారు. వచ్చే గురువారం వోట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఏప్రిల్-మేలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఓట్-ఆన్-అకౌంట్ ఉండనుంది. ఇది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు నిధులను కేటాయించేందుకు ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది. ఎన్నికల కారణంగా ఈ బడ్జెట్‌లో విధానపరమైన మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఇటీవల డిసెంబర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలోనూ ఆర్థిక మంత్రి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సాధారణ ఎన్నికలకు ముందు ఇది కేవలం ఓట్-ఆన్-అకౌంట్ మాత్రమేనని ఆమె అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 2024-25కి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించనున్నారు.
2019లో ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం రెండవసారి అధికారంలో వచ్చిన తర్వాత నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళగా గుర్తింపు పొందిన నిర్మలా సీతారామన్, పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పించిన తొలి మహిళా ఆర్థిక మంత్రిగా కూడా నిలిచారు. అలాగే, మునుపటి సంప్రదాయాన్ని వదిలి రాజముద్ర కలిగిన ఎరుపు రంగు వస్త్రంలో బడ్జెట్‌ను తీసుకొచ్చే కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించారు. అనంతరం 2020లో కరోనా మహమ్మారి సమయంలో పేదల కోసం పలు ఉపశమన పథకాలను, ప్రత్యేక ప్రకటనలు చేశారు. నిర్మలా సీతారమన్ హయాంలోనే భారత్ అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తోంది.