50 శాతం పెరిగిన ఇండస్ఇండ్ బ్యాంక్ లాభాలు!

by Javid Pasha |
50 శాతం పెరిగిన ఇండస్ఇండ్ బ్యాంక్ లాభాలు!
X

ముంబై: ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో మెరుగైన లాభాలను సాధించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు నికర లాభాలు 50 శాతం పెరిగి రూ. 2,040 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ. 1,361 కోట్ల లాభాలను ప్రకటించింది. ఇక, 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 14 డివిడెండ్‌ను ఇచ్చేందుకు బ్యాంకు డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో బ్యాంకు తెలిపిన వివరాల ప్రకార, సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంకు వడ్డీ ఆదాయం 17 శాతం పెరిగి రూ. 4,669 కోట్లకు పెరిగింది.

అదే మొత్తం 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ ఆదాయం 17 శాతం పెరిగి రూ. 17,592 కోట్లుగా నమోదైంది. బ్యాంకు మొడి బకాయిలు డిసెంబర్ చివరి నాటికి 2.06 శాతం నుంచి మార్చి నాటికి 1.98 శాతానికి మెరుగుపడింది. ఇక, మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు నిర్వహణ ఖర్చులు రూ. 9,311 కోట్ల నుంచి రూ. 11,346 కోట్లకు పెరిగాయని పేర్కొంది.

Advertisement

Next Story