తక్కువ ధర కారణంగా రికార్డు స్థాయిలో భారత్‌లోకి రష్యా చమురు!

by Harish |   ( Updated:2023-02-06 13:21:59.0  )
తక్కువ ధర కారణంగా రికార్డు స్థాయిలో భారత్‌లోకి రష్యా చమురు!
X

న్యూఢిల్లీ: భారత్‌కు వచ్చే ముడిచమురు దిగుమతుల్లో రష్యా వాటా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యా మీద పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అంతకుముందు రష్యా నుంచి మన దేశానికి కేవలం 0.2 శాతం మాత్రమే ముడి చమురు దిగుమతులు జరిగేవి. ప్రస్తుతం ఇది 28 శాతానికి పెరిగింది. ఆంక్షల కారణంగా భారత్‌కు రష్యా తక్కువ ధరకు ముడిచమురును విక్రయిస్తోంది. ఇది కొన్ని నెలల నుంచి ఉన్నప్పటికీ ఈ ఏడాది జనవరి నెలలో గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని ప్రముఖ ఇంధన రవాణా ట్రాకర్ వొర్టెక్సా తెలిపింది.

ఆంక్షల వల్ల ఆదాయం తగ్గిపోవడంతో రష్యా ముడి చమురును రాయితీ ధరకు ఇస్తోంది. ఈ అవకాశాన్ని భారత్‌తో పాటు చైనా సద్వినియోగం చేసుకుంటున్నాయి. అంతకుముందు డిసెంబర్‌లో రష్యా నుంచి 26 శాతం ముడిచమురు దిగుమతి అయింది. జనవరి నాటికి 28 శాతంతో 12.7 లక్షల యూనిట్లకు చేరాయి. దీన్ని తర్వాత ఇరాక్ 20 శాతం, సౌదీ 17 శాతం, అమెరికా 9 శాతం, యూఏఈ 8 శాతం వాటా చమురును భారత్‌కు విక్రయిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed