- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గ్రీన్ హైడ్రోజన్ రంగం ఎదిగేందుకు రూ. లక్ష కోట్లు అవసరం
దిశ, బిజినెస్ బ్యూరో: భారత గ్రీన్ హైడ్రోజన్ రంగం ఎదిగేందుకు భారీగా మద్దతు అవసరమని ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ అల్వరెజ్ అండ్ మార్సల్(ఏఅండ్ఎం) అభిప్రాయపడింది. 2030 నాటికి ఈ రంగానికి కనీసం రూ. 33,000 కోట్ల నుంచి గరిష్ఠంగా రూ. లక్షల కోట్ల అవసరం ఉందని సంస్థ తన నివేదికలో తెలిపింది. సరైన మద్దతు లభిస్తే దేశీయ గ్రీన్ హైడ్రోజన్ రంగం 2030 నాటికి రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 3 లక్షల కోట్ల వరకు వ్యాపార సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అంచనా వేసింది. ప్రభుత్వ రాయితీలను పొందే గ్లోబల్ కంపెనీలకు పోటీగా దేశీయ సంస్థలకు అవకాశాలు కల్పించడం ద్వారా తుది వినియోగం ధరల్లో మార్పు తీసుకురావొచ్చని, ఇది మార్కెట్లో పోటీ పెంచి ప్రత్యామ్నాయాలకు వీలుంటుందని నివేదిక పేర్కొంది. గ్లోబల్ స్థాయిలో యూఏఈ, సౌదీ అరేబియాతో పాటు భారత్ గ్రీన్ హైడ్రోజన్ రంగంలో పోటీ పడుతోందని ఏఅండ్ఎం తెలిపింది. దీనివల్ల ప్రపంచ గ్రీన్ హైడ్రోజన్ వ్యాపారంలో భారత్‌కు గణనీయమైన వాటా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు దేశాలు 2030 నాటికి కిలో గ్రీన్ హైడ్రోజన్ 2 డాలర్లు అంటే రూ. 166 తక్కువకు ఉత్పత్తి చేస్తాయని నివేదిక భావిస్తోంది.