- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
GDP: బలహీన వినియోగంతో రెండో త్రైమాసికంలో తగ్గిన జీడీపీ వృద్ధి
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు నెమ్మదించింది. శుక్రవారం కేంద్ర గణాంక కార్యాలయం వెల్లడించిన డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా వినియోగం బలహీనంగా ఉండటం, ప్రభుత్వ వ్యయం తగ్గడం, కీలక పరిశ్రమలపై ప్రతికూల వాతావరణ ప్రభావం కారణంగా జూలై-సెప్టెంబర్ మధ్య ఆర్థికవ్యవస్థ వృద్ధి 5.4 శాతానికి తగ్గింది. గతేడాది ఇదే త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 8.1 శాతంగా నమోదైంది. త్రైమాసిక పరంగా కూడా ఏప్రిల్-జూన్ మధ్య వృద్ధి 6.7 శాతంగా ఉంది. ప్రధానంగా తయారీ రంగం క్షీణత వల్ల వృద్ధిపై ఎక్కువ ఒత్తిడి ఉందని గణాంకాలు తెలిపాయి. అయితే, వృద్ధి నెమ్మదించినప్పటికీ వేగంగా వృద్ధి చెందే దేశాల జాబితాలో భారత్ ముందుండటం విశేషం. వ్యవసాయ రంగం మెరుగ్గా ఉండటంతో గ్రామీణ వినియోగం సానుకూలంగా ఉంది. అయితే పెరిగిన రుణ రేట్లు, ఆహార ద్రవ్యోల్బణం కారణంగా పట్టణ ప్రాంతాల్లో వినియోగం తగ్గిందని ఆర్థిక వృత్తలు పేర్కొన్నారు.