- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత వృద్ధి అంచనాను తగ్గించిన ప్రపంచ బ్యాంకు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత వృద్ధి అంచనాను తగ్గిస్తున్నట్టు ప్రపంచ బ్యాంక్ తెలిపింది. రాజకీయ భౌగోళిక పరిస్థితులతో పాటు వినియోగం తగ్గిన కారణంగా 2023-24 అంచనాలను 6.3 శాతానికి సవరిస్తున్నట్టు ప్రపంచ బ్యాంక్ మంగళవారం తన నివేదికలో వెల్లడించింది. గతేడాది డిసెంబర్‌లో భారత వృద్ధిని 6.6 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. 'ఇండియా డెవలప్‌మెంట్ అప్‌డేట్' పేరుతో వెలువరించిన నివేదిక ప్రకారం, పెరుగుతున్న రుణాల వడ్డీ రేట్లు, ఆదాయ వృద్ధి నెమ్మదించడం వల్ల వినియోగం ప్రభావితం కావడం జీడీపీ అంచనాలను తగ్గించేందుకు కారణమయ్యాయి. కరోనా మహమ్మారి సమయంలో చేపట్టిన ఆర్థిక సహాయ చర్యలు ఉపసంహరిస్తున్న వేళ వినియోగం తగ్గుతోంది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మాంద్యం భయాలు, ఇతర ఆర్థిక అనిశ్చితి వల్ల భారత వృద్ధిని తగ్గించినట్టు వరల్డ్ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ అగస్టొ టానో కౌమే అన్నారు. మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ గ్లోబల్ కమొడిటీ ధరలు తగ్గుముఖం పట్టడం, దేశీయ గిరాకీ స్థిరత్వం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5.2 శాతానికి దిగొస్తుందని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది. ఇక, ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాలతో భారత ఆర్థిక రంగం పటిష్టంగా ఉంది. ఆస్తుల నాణ్యత మెరుగుపడిందని, బలమైన ప్రైవేట్ రంగ క్రెడిట్ వృద్ధి సానుకూలంగా ఉందని పేర్కొంది.